నకిరేకల్‌ స్థానాన్నికాంగ్రెస్‌ పార్టీకి ఇవ్వొద్దు-కోమటిరెడ్డి

నకిరేకల్‌ స్థానాన్ని మన ఇంటి పార్టీకి ఇవ్వవద్దని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరారు. ఈ రోజు ఆయన దిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీని కలిశారు. చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్‌ సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్‌ సీట్లు కేటాయిస్తుందన్న ఆశ తనకు ఉందన్నారు. తెరాసపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌ గెలుపుగా మలచుకోవాలని వ్యాఖ్యానించారు. సూర్యాపేట నుంచి పటేల్‌ రమేశ్‌రెడ్డికి సీటు ఇస్తారని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. మునుగోడు నుంచి తనకు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్‌కు, నకిరేకల్‌ నుంచి చిరుమర్తి లింగయ్యకు సీట్లు వస్తాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

29 total views, 1 views today