పెళ్లి లైసెన్స్ రావడం తో ప్రియాంక చోప్రా సంబరాలు

ప్రియాంక చోప్రా-పాప్ సింగర్ నిక్ జోనస్ లు మరో నెలలో ఒకటికాబోతున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే వీరిద్దరూ పెళ్ళికి సంబందించిన షాపింగ్ తో పాటు పెళ్లి తర్వాత ఉండబోయే ఇల్లు ఇవ్వన్నీ పూర్తి చేసారు. ఇక తాజాగా కోర్ట్ నుండి పెళ్లి లైసెన్స్ పొందినట్లు తెలుస్తుంది. ఇటీవలే అమెరికాలో వీరి వివాహానికి సంబంచిన ఏర్పాట్లు మొదలు పెట్టిన వీరు, రీసెంట్ గా తన సన్నిహితులు, స్నేహితులకు ప్రియాంక బ్యాచులర్ పార్టీ కూడా ఇచ్చింది.

ఈ పార్టీ తరువాత ప్రియాంక, నికి జోనస్ లు బ్యావెర్లీ హిల్స్ లోని కోర్టు కు వెళ్లి పెళ్లి లైసెన్స్ కోసం అప్లై చేశారట. తాజాగా కోర్టు వీరికి మ్యారేజ్ లైసెన్స్ అందించినట్లు సమాచారం. పెళ్లి లైసెన్స్ రావడం తో ఇద్దరు సంబరాలు చేసుకుంటున్నారట. డిసెంబర్ లో ఇండియాలోని జోధ్ పూర్ లో వీరి వివాహం జరగనుంది.

42 total views, 1 views today