బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ ఫస్ట్ లుక్

ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే మాస్ ఇమేజ్ సంపాదించిన బెల్లంకొండ తనయుడు తర్వాత వచ్చిన చిత్రంతో దెబ్బతిన్నా..బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకి నాయక’ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా హీరోగా  మంచి మార్కులే కొట్టేశాడు.బెల్లంకొండ శ్రీనివాస్ మరో యాక్షన్ మూవికి సిద్దమైనట్లు సమాచారం. తాజాగా శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. దీనికి ‘కవచం’ అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. పోస్టర్ లో క్రియేటివిటీ పెద్దగా లేకపోయినా.. టైటిల్ మాత్రం క్యాచీగా ఉంది.

33 total views, 1 views today