‘టాక్సీవాలా’ లీక్.. విజయ్ వినూత్న ప్రచారం

‘టాక్సీవాలా’ పిల్ల గ్యాంగ్‌తో కలిసి కొత్త పంథాలో మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన ‘టాక్సీవాలా’ అనేక వాయిదాల అనంతరం నవంబర్ 17న విడుదల కానుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ది రియాలిటీ బిహైండ్ టాక్సీవాలా’ అనే మూడు నిమిషాల నిడివితో ఓ వీడియోను విడుదల చేశాడు విజయ్ దేవరకొండ. ఇందులో అప్పట్లో ‘టాక్సీవాలా’ రా ఫుటేజ్ లీకేజ్‌ని ఇన్నోవేటివ్‌గా ప్రజెంట్ చేశారు.

‘టాక్సీవాలా’ పిల్ల గ్యాంగ్‌ని చూసి భయపడి తలుపు వేసుకున్న విజయ్ దేవరకొండ.. వాళ్లతో మూవీ మేకింగ్ ముచ్చట్లు పెట్టాడు. ‘మళ్లీ గెడ్డం పెంచావా? అని ఓ పిల్లోడు అంటే.. రేయ్ ఇప్పుడు నువ్ నా గెడ్డం జోలికి రాకు. నేను ఇప్పుడు నా గెడ్డం తీయలేను. సినిమా కంటిన్యుటీ ఉంది అని చెప్పడం.. ఇంతకీ ఏం సినిమాలు అంటే.. మొన్ననే వచ్చింది కదరా ‘నోటా’ అని విజయ్ అంటే అది హాలిడేస్‌లోనే వెలిపోయిందని పిల్లోడు పంచ్ పేల్చాడు. ‘గీతా గోవిందం’ కూడా థియేటర్స్‌లో ఉంది. మంచి ఫ్యామిలీ సినిమా మీకు కావాల్సింది అనే కదా వెళ్లి చూడండి అంటే.. మేం అడిగింది అది కాదనేశారు పిల్లలు.

దీంతో హో.. మీరు అడుగుతుంది టాక్సీవాలా చిత్రం గురించా అంటూ మూవీ ముచ్చట్లు మొదలు పెట్టిన విజయ్‌తో ఆ సినిమా యావరేజ్ అంట కదా.. ఆల్రెడీ మా ఫ్రెండ్ చూశారు అని అడ్డుతగిలారు పిల్లలు. దీంతో ఎవరు అన్నారు? అదసలే థియేటర్స్‌లోకే రాలేదు ఎలా చూశారు అంటే.. మొబైల్స్‌లోకి వచ్చిందిలే అని పంచ్ పేల్చారు పిల్లలు. దాని మీద ఎలా కామెంట్ చేస్తారురా.. దానికింకా బొచ్చెడు పని ఉంది.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల చాలా ఉన్నాయ్. అదింకా పూర్తి కాని సినిమా. మీకు ఎలా చెప్పితే అర్ధం అవుతుంది అంటూ వండని పాస్తాలను పిల్లలకు తినిపించాడు. అవి బాలేదు అని అనడంతో వండటం మొదలు పెట్టాడు. ఆ తరువాత ఏమైందో ఈ వీడియోలో చూడండి.

83 total views, 1 views today