కర్నూలు జిల్లాలో సీన్‌ చూసి అమిత్‌షా ఆశ్చర్యానికి గురయ్యారట!

రాయలసీమలో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో పోల్చితే కర్నూలు జిల్లాలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే నేతల మధ్య అంతర్గత విభేదాల కారణంగా కర్నూలు కోటలో కమలంపార్టీ ప్రభ క్రమంగా మసకబారుతోంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు హరీశ్‌బాబులకు అస్సలు పొసగటం లేదు. వీరిద్దరి మధ్య సాగుతున్న కోల్డ్‌వార్ ఇటీవల పార్టీ పెద్దల ముందే బహిర్గతమైంది. మంత్రాలయంలో ఈ మధ్య జరిగిన ఆర్ఎస్‌ఎస్ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చారు. రాత్రి డిన్నర్‌ కోసం కర్నూలు శివారులోని టోల్‌ప్లాజా భవనానికి వెళ్లారు. ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు హరీశ్‌బాబు బలప్రదర్శన చేశారు. ఈ సీన్‌ చూసి అమిత్‌షా వెంటవచ్చిన తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారట!

51 total views, 1 views today