బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్‌: థాయ్‌లాండ్‌ సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారి రాజారావు తెలిపారు. ఇది మరింత తీవ్రమై వాయుగుండంగా మారి అండమాన్‌ దీవుల వైపు వచ్చే అవకాశాలున్నాయన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుపై ఉంటుందన్నారు. తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని చెప్పారు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయి. పొడి వాతావరణం వల్ల ఉక్క పోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

56 total views, 1 views today