క్రేజీ స్టార్‌తో అనుష్క కొత్త సినిమా

‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపుతెచ్చుకున్న అందాల అనుష్క తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది. బాహుబలి 2 తరువాత ‘భాగమతి’ చిత్రంతో అభిమానుల్ని అలరించిన అనుష్క.. ఆ తరువాత కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయలేదు. దీంతో ఆమెపై రకరకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. అనుష్క ఫోకస్ సినిమాల నుండి పెళ్లి వైపు మళ్లిందని.. త్వరలో తన ‘డార్లింగ్’ ప్రభాస్‌ని పెళ్లాడబోతుందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి.

ఇలాంటి రూమర్స్ అనుష్కపై రావడం కొత్తేం కాదు కాని.. వీటిని లైట్ తీసుకున్న అనుష్క తన కొత్త సినిమాకు కొబ్బరి కాయ కొట్టేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత, దర్శక, నిర్మాత కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘వస్తాడు నా రాజు’ ఫేం హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్మైలీ స్టార్ మాధవన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో యూఎస్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

67 total views, 2 views today