304(ఏ) అంటే వొణికిపోతున్న జనాలు

సెక్షన్ 304(ఏ) పేరు చెప్తే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.అసలు సెక్షన్ 304(ఏ) అంటే ఏంటి అది వాహనదారుల మీద ఎలాంటి భారం వేస్తుంది…వాహనానికి ప్రమాదం జరిగితే దాన్ని హత్యా కేసు గా పరిగణిస్తున్నారు ఎందుకు?…సెక్షన్ 304(ఏ) వివరంగా చూద్దాం..

*అసలు సెక్షన్ 304 (ఏ)అంటే ఏమిటి?
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వాహనం నడిపిన లేదా ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై  కేసు నమోదు చేసేవారు దీనితో పాటు ప్రమాదాన్ని బట్టి జైలు శిక్ష కూడా విధించేవారు.కొంత కాలం కిందట ఈ సెక్షన్ ని సవరించి ప్రమాదాల నివారణ నిమిత్తం సెక్షన్ 304(ఏ) ని అమల్లోకి తెచ్చారు. ఈ సెక్షన్ లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా,నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇతరుల ప్రాణాలకి నష్టం కలిగించినట్టు భావించినా హత్య కేసు తో సమానంగా సవరించారు.వాహనం నడిపిన డ్రైవర్ తో పటు వాహన యజమాని మీద కూడా కేసు నమోదు చేస్తారు.

*ఈ కేసు లో శిక్షలు ఇలా ఉంటాయి
ఇంతక ముందు  ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపినట్టు పరిగణిస్తే రెండేళ్లపాటు జైలు శిక్ష ఉండేది.ఇందులో వాహనం నడిపిన వ్యక్తి పైనే కేసు కేసు నమోదు చేసి శిక్ష విధించేవారు.
సెక్షన్ 304(ఏ)లో వాహనం నడిపిన వారితోపాటు వాహన యజమానికి కూడా శిక్ష విధిస్తారు.సవరించిన చట్టం ప్రకారం దాదాపు పదేళ్ల జైలు శిక్ష పడుతుంది.

*మంచం మీద ఉన్నా శిక్షార్హుడే !
అనారోగ్యంతో బాధ పడుతూ మంచం మీద ఉన్న వ్యక్తికీ నోటీసిలు వచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి.సెక్షన్ 304 (ఏ)కింద కేసు బుక్ అయ్యింది. వచ్చి పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆహ్ నోటీసు లో ఉంది.అసలు విషయం ఏంటంటే పదేళ్ల క్రితం అతను ఒక మోటార్ సైకిల్ అమ్మాడు,కొనుక్కున్న వ్యక్తి పేరు మీదకి అతను దాన్ని బదిలీ చెయ్యలేదు.వాహనం కొనుకున్న వ్యక్తి రోడ్ మీద వెళ్తూ ఎదురుగ వస్తున్న వ్యక్తిని డీ కొట్టడంతో అతను చనిపోయాడు.ఈ కేసులో వాహనం నడిపిన వ్యక్తి తో పటు వాహన యజమాని అంటే ఎవరి పేరు మీద ఉందొ వారిని కూడా అరెస్ట్ చెయ్యాల్సి వచ్చింది.

*పోలిసుల హెచ్చరికలు
ప్రమాదాలు అరికట్టడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది గా సూచిస్తున్నారు.వాహనాలు అమ్మేటప్పుడు కొన్న వారి పేరు మీద బదిలీ చెయ్యడం ,అలాగే కొనేటప్పుడు పాత కేసులు ఎమన్నా ఉన్నాయో లేదో చుస్కోడం తప్పనిసరి అని చెప్తున్నారు.అర్హత లేనివారికి (లైసెన్స్ లేనివారికి ) వాహనాలు ఇవ్వొద్దు అని ,ఒకవేళ ఎవరికైనా వాహనం ఇచ్చి వారు ప్రమాదానికి గురైన…గురిచేసినా…వాహన యజమాని కూడా శిక్షార్హుడే అని హెచరిస్తున్నారు .

201 total views, 2 views today