డీఎంకే నేతలు చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకనున్నారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం చెన్నైకి రానున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడంలో భాగంగా ఆయన పలువురు నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 6 గంటలకు చెన్నైకి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అళ్వార్‌పేట్‌లోని చిత్తరంజన్‌ రోడ్డులో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ నివాసానికి చేరుకుంటారు. స్టాలిన్‌, ఇతర డీఎంకే నేతలు చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకనున్నారు.అనంతరం సుమారు గంటపాటు స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా బయలు దేరి చెన్నై విమానాశ్రయం చేరుకుంటారు. 8.50కి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల సీనియర్‌ నేతలు పలువురు పాల్గొననున్నారు.

47 total views, 1 views today