నేటి నుంచి గంగానమ్మ జాతర

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం నుంచి పండుగలు, పెళ్లిళ్లు తదితర శుభకార్యాలకు మూడు నెలలపాటు (ఫిబ్రవరి 12వరకు) బ్రేక్‌ పడనుంది. స్థానిక పడమర వీధిలోని గంగానమ్మ, ఆదిమహాలక్ష్మమ్మ, వినుకొండ అమ్మవారు, పోతురాజుబాబులకు ఏడేళ్లకోసారి నిర్వహించే జాతర ప్రారంభం కావడమే దీనికి కారణం. వందేళ్లకుపైగా వస్తున్న సంప్రదాయాలను అనుసరిస్తూ ఈ జాతరను మూడు నెలలపాటు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో 101మంది దేవతలు నగరంలో సంచరిస్తారని భక్తుల నమ్మకం. ఈ సమయంలో అమ్మవారిని మాత్రమే పూజించాలి. వివాహాలు, వేడుకలు నిర్వహించకూడదు. ఇళ్లలో నిత్య దీపారాధన చేసుకోవచ్చు.కొబ్బరి కాయలు కొట్టడం నిషేధం. నాగుల చవితి, నోములు, సంక్రాంతి పండుగలు సైతం నిర్వహించకూడదు. కొత్త వస్త్రాలు కూడా ధరించరాదు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

52 total views, 1 views today