మిస్‌ ఆఫ్రికా ఇండియా-2018 పోటీల ఫైనల్స్‌ లో బ్లాక్ బ్యూటీల సందడి

దేశంలో నివసిస్తున్న ఆఫ్రికావాసుల కోసం కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న మిస్‌ ఆఫ్రికా ఇండియా-2018 పోటీల ఫైనల్స్‌ గురువారం రాత్రి మాదాపూర్‌లోని సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ముగిశాయి. హైదరాబాద్‌, నోయిడా, బెంగళూరు, చండీఘర్‌, ఢిల్లీ, పుణె, కాకినాడ, భువనేశ్వర్‌, ముంబై ఆడిషన్స్‌ల్లో ఎంపిక చేసిన 15మంది ఫైనలి్‌స్టలతో పోటీలు నిర్వహించారు. కాంగో, మడగాస్కర్‌, జాంబియా, నైజీరియా, టాంజినీయా, కాంగో తదితర 12 ఆఫ్రికా దేశాల యువతులు పోటీల్లో పాల్గొన్నారు.ఆఫ్రికా నృత్యాలు, సంగీతంతోపాటు ఆఫ్రికా సంప్రదాయాలను చాటే రీతిలో జరిగిన పోటీలకు మోడల్‌, నటుడు శ్రీధర్‌రావు, ఎంసీ శివానీ సేన్‌, గ్రేస్‌ (నైజీరియా), సోషలైట్‌ రౌనక్‌, ఫ్యాషన్‌ కొరియోగ్రాఫర్‌ జోసె్‌ఫసుందరం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

43 total views, 1 views today