గాలి జనార్ధన్ రెడ్డి గురించి షాకింగ్ విషయం..

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కోసం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసుల వేట కొనసాగుతోంది. ఆయన అజ్ఞాతంలో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ప్రజలను మోసం చేసి 600 కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడేందుకు 18 కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ గాలిపై ఆరోపణలు వచ్చాయి. వచ్చిన ఆరోపణలతో గాలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.

ఈ వ్యవహారంలో ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కనిపించకుండాపోయిన గాలి ఆచూకీ కోసం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ కేసు విషయంలో గాలి జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసినట్టు సమాచారం. గాలి ఇంట్లో గోడల మధ్యలో రహస్య లాకర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాలి జనార్ధన్‌రెడ్డి అసిస్టెంట్ అలీఖాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లభ్యమైనట్లు ప్రకటించారు. మరోవైపు రెండు రోజులు గడిచినా గాలి ఎక్కడుంది తెలియకపోవడంతో దేశం విడిచి పారిపోయి ఉండొచ్చనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి.

31 total views, 1 views today