చంద్రబాబుతో కేసీఆర్ అన్న కూతురు భేటీ

కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు..ఏపీ సీఎం చంద్రబాబునాయుడ్ని కలుసుకున్నారు. కాంగ్రెస్ నుంచి కరీంనగర్ జిల్లాలో పోటీ చేయాలని రమ్యారావు అనుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రధాన్యత ఏర్పడింది. అమరావతి వెళ్లిన కేసీఆర్ అన్న కూతురు ఉండవల్లిలోని సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న రమ్యారావు..పార్టీలో కొందరు నేతల తీరుతో ఆమె మనస్తాపం చెందారు. ఈ పరిస్థితుల్లో తనకు టికెట్ వచ్చేలా సహకరించాలని చంద్రబాబును రమ్యారావు కోరటం ఆసక్తిగా మారింది.

37 total views, 1 views today