మెగా కుటుంబం అంతా ఒకేచోట!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలోకి మెగా ఫ్యామిలీ నుంచి అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఆ మద్య చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు పది సంవత్సరాల తర్వాత తిరిగి తెరపై రీ ఎంట్రీ ఇచ్చాడు. వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’చిత్రంతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో బ్రిటీష్ వారిపై పోరాడిన మొట్టమొదటి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. తాజాగా దీపావళి పర్వదినం నాడు మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకచోట చేరారు. మెగా ఫ్యామిలీ హీరోలంతా దీపావళి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను రాంచరణ్ భార్య ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకోగా, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, కల్యాణ్ దేవ్, వరుణ్ తేజ్, నాగబాబు, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ ఫోటోల్లో ఉన్నారు. సురేఖ, శ్రీజ, ఉపాసన, నీహారిక, స్నేహారెడ్డి తదితరులు టపాసులు కాలుస్తూ సందడి చేశారు. ఆ ఫోటోలు మీరూ చూడవచ్చు.

62 total views, 1 views today