చంద్రబాబుకు స్వాగతం పలికిన దేవెగౌడ, కుమారస్వామి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెంగళూరు చేరుకున్నారు. పద్మనాభనగర్‌కు చేరుకున్న ఆయనకు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి సాధర స్వాగతం పలికారు. మోదీ వ్యకేతిక కూటమిపై ముగ్గురు చర్చలు జరుపుతున్నారు. మోదీ వ్యతిరేక కూటమిపై విపక్షాలను ఏకం చేస్తున్న చంద్రబాబు.. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో పలువురు నేతలతో చర్చలు జరిపారు. ఇప్పుడు దక్షిణాదినేతలతో భేటీ అవుతున్నారు. కుమారాస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా కూడా మోదీ వ్యతిరేక కూటమి చర్చకు వచ్చింది. అప్పట్లో చంద్రబాబుకు దేవెగౌడ, కుమారస్వామి మద్దతు పలికారు. ఇప్పుడు ఈ ప్రయత్నాలు మరింత ఊపందుకోవడంతో మరోసారి భేటీ అయ్యారు.

కర్నాటక ఉప ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తిరుగులేని విజయం సాధించింది. మోదీకి వ్యతిరేకంగా పోరాటం సాగుతుందని ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేవెగౌడ, కుమారస్వామిని చంద్రబాబు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ బెంగళూరులో చర్చలు ముగిసిన తర్వాత రేపు (శుక్రవారం) చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అవుతారు. ఇప్పటికే చంద్రబాబు-స్టాలిన్ ఒకసారి చర్చలు జరిపారు.

18 total views, 1 views today