కాలిఫోర్నియా బార్‌లో కాల్పులు.. పలువురికి గాయాలు

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇవాళ కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. థౌజండ్‌ ఓక్స్‌ ప్రాంతంలో ఓ బార్‌లో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. బుల్లెట్‌ గాయాలు తగిలిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. కాలేజి మ్యూజిక్‌ నైట్‌ జరుగుతున్న సమయంలో బారులో కాల్పులు జరిగాయి. ఓ సాయుధుడు సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు.

67 total views, 1 views today