తాడేపల్లిగూడెంలో నెలకొన్న ఉద్రిక్తతను పరిష్కరించేందుకు పోలీసుల యత్నం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నెలకొన్న ఉద్రిక్తతను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం అభివృద్ధిపై చర్చకు సిద్ధమైన జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావుతో పోలీసులు విడివిడిగా సమావేశమయ్యారు. బహిరంగ చర్చను నిలిపివేయాలని ఈ సందర్భంగా నేతలను వారు కోరారు. వెంకట్రామన్నగూడెంలో చర్చల కోసం ఏర్పాటు చేసిన పందిళ్లను పోలీసులు తొలగించారు.

అభివృద్ధిపై చర్చకు అటు టీడీపీ, ఇటు బీజేపీ సై అనడంతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. చర్చలో పాల్గొనేందుకు వెంకటరామన్నగూడెం చేరుకున్న జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అటు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావును తాడేపల్లిగూడెంలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.

65 total views, 1 views today