చంద్రబాబుకు హరీశ్‌రావు బహిరంగ లేఖ

ఏపి సిఎం చంద్రబాబుకు మంత్రి హరీశ్‌రావు బహిరంగా లేఖ రాశారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ. 19 ప్రశ్నలతో కూడిన లేఖను ఆయన బాబుకు రాశారు. చంద్రబాబు తన రాజకీయ ఉనికిన కాపాడుకునేందుకు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని హరీశ్‌ ఆరోపించారు.

హరీశ్‌రావు అడిగిన 19 ప్రశ్నలు ఇవే:

• నీటి ప్రాజెక్టులకు అడ్డుకునే కుట్ర
• పాలమూరురంగారెడ్డిని అడ్డుకునే కుట్ర
• కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతారా?
• పాలేరుకు నీళ్లు ఇవ్వడం పాపమా?
• కేసీ కెనాల్ కోసం తమ్మిళ్ల వద్దంటారా?
• కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా?
• పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు
• శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వొద్దనడం కుట్ర కాదా? • ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు?
• పోలవరం ముంపు మండలాలు గుంజుకోవడం కుట్ర కాదా?
• సీలేరు ప్లాంట్ పోవడం వల్ల మాకు రూ.500 కోట్ల నష్టం
• విద్యుత్ పంపిణీలో దుర్మార్గమైన వైఖరి
• పీపీఏలను ఏకపక్షంగా రద్దు చేసి 2,465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా?
• ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వకుండా టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం
• ఖాళీ భవనాలు ఇవ్వకపోవడం మీ సంకుంచితత్వం కాదా?
• హైదరాబాద్ ఆస్తుల్లో మీ వాటా అడగటం దురాశ కాదా?
• విభజన మాయని గాయమని బాధపడలేదా?

27 total views, 1 views today