రాముడి విగ్రహం నిర్మిస్తాం ధ్రువీకరించిన యూపీ ముఖ్యమంత్రి యోగి

శ్రీరాముడి జన్మభూమి అయిన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. ఇటీవల రాముడి భారీ విగ్రహ ఏర్పాటు గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని యోగి ధ్రువీకరించారు. దీపావళి పర్వదినం సందర్భంగా యోగి ఈరోజు అయోధ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యూపీలోని ఫైజాబాద్‌ జిల్లాను అయోధ్య జిల్లాగా పేరు మార్చనున్నట్లు నిన్న యోగి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈరోజు యోగి అయోధ్యలోని హనుమాన్‌ ఆలయంలో పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాముడి విగ్రహం ఏర్పాటుకు తగిన స్థలం కోసం తాను రెండు ప్రదేశాలు పరిశీలించినట్లు తెలిపారు. ‘రాముడి విగ్రహ ఏర్పాటు గురించి మాకు ఆలోచన ఉంది. దానిపై ఇంకా చర్చలు జరుపుతాం. ఈరోజు రెండు ప్రదేశాలు చూశాను. ఆలయాల్లో రాముడికి పూజలు జరుగుతుంటాయి. విగ్రహాన్ని ఎంతో దూరం నుంచైనా చూడొచ్చు. అది ఏర్పాటవుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తున్నాం. సర్వేలు జరుగుతున్నాయి. ఆర్కిటెక్ట్స్‌ పలు డిజైన్లు సూచించారు’ అని తెలిపారు.

43 total views, 1 views today