‘అదుగో’ మూవీ రివ్యూ

న‌టీన‌టులు: అభిషేక్ వ‌ర్మ‌, న‌భా నటేశ్‌, ర‌విబాబు, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్కే, వీరేంద‌ర్ చౌద‌రి, సాత్విక్ త‌దిత‌రులు
సంగీతం: ప‌్రశాంత్ ఆర్ విహార్
పాట‌లు: భాస్క‌ర‌భ‌ట్ల
మాట‌లు: ర‌విబాబు, నివాస్
నిర్మాత‌: డి.సురేష్‌బాబు
క‌థ, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌కత్వం: ర‌విబాబు

క‌థ:
బంటి (పందిపిల్ల‌) త‌న తండ్రి చెప్పిన మాట‌ల్ని పెడచెవిన పెట్టి ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. భూమి విష‌యంలో గొడ‌వ‌లున్న సిక్స్‌ప్యాక్ శ‌క్తి (రవిబాబు), దుర్గ అనే ఇద్ద‌రు ముఠాల చేతిలో చిక్కుకుంటుంది. భూమికి సంబంధించిన స‌మాచారం ఉన్న మైక్రోచిప్‌ని బంటి మింగ‌డంతో దానిని చేజిక్కించుకోవ‌డం కోసం ఆ రెండు ముఠాలు పోటీప‌డుతుంటాయి. ఇదే సమయంలో రాజీ (న‌భా), అభిషేక్ (అభిషేక్ వ‌ర్మ‌)అనే ప్రేమికుల చేతుల్లోకి బంటి వెళ్లుతుంది. దాంతో ఆ ప్రేమ‌జంట కూడా రెండు ముఠాల మ‌ధ్య ఇరుక్కుపోతుంది. ఇంత‌లో హైద‌రాబాద్ న‌గ‌రంలో పంది పిల్ల‌ల రేసింగ్ కోసం మ‌రో రెండు ముఠాలకి బంటి అవ‌స‌రం అవుతుంది. ఇంత మంది రౌడీలు కొన‌సాగించిన వేట మ‌ధ్య బంటి, ప్రేమ‌జంట ఎన్ని క‌ష్టాలు ప‌డింది? బ‌ంటి త‌ప్పించుకుని ఎలా మ‌ళ్లీ త‌న ఇంటికి వెళ్లిపోయింది? ప్రేమ‌జంట క‌థ సుఖాంత‌మైందా? లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

బ‌లాలు
+ బంటి విన్యాసాలు
+ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించే స‌న్నివేశాలు
+ సాంకేతిక‌త‌

బ‌ల‌హీన‌త‌లు
– క‌థ
– జుగుప్స క‌లిగించే స‌న్నివేశాలు

రేటింగ్: 2 / 5

172 total views, 1 views today