సర్కార్‌ రివ్యూ

న‌టీన‌టులు: విజయ్‌, కీర్తి సురేశ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ప్రేమ్‌ కుమార్‌, యోగిబాబు, రాధా రవి, తులసి, వైశాలి థనిక, జశ్వంత్‌ కణ్నన్‌ తదితరులు

స‌ంగీతం: ఏఆర్‌ రెహమాన్‌

కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌

ఛాయాగ్ర‌హ‌ణం: గిరీశ్‌ గంగాధరన్‌

పోరాటాలు: రామ్‌ల‌క్ష్మ‌ణ్‌

నిర్మాత‌లు: కళానిధి మారన్‌

ద‌ర్శ‌క‌త్వం: మురుగదాస్‌

సంస్థ: సన్‌ పిక్చర్స్‌

కథ :
సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలోనే నెం.1 కంపెనీకి సి.ఇ.ఓ. తన జీవితంలో తన తండ్రీ మరణం తాలూకు సంఘటన కారణంగా సుందర్ రామస్వామి ఓటుకి ఎంతో విలువ ఇస్తాడు. ఈ నేపధ్యంలో తన స్వంత రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ష్ జరుగుతాయి. దీంతో సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన ఊరికి వస్తాడు. కానీ అప్పటికే సుందర్ ఓటును ఎవరో దొంగ ఓటుగా వెయ్యటం జరుగుతుంది. దీనిపై సుందర్ కోర్టుకు వెళ్లి.. తన ఓటు సంగతి తేలే వరకు ఎలక్షన్ రిజల్ట్స్ ఆపేలా చేస్తాడు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత కోర్టు జరిగిన ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలను నిర్వహించాలని ఆర్డర్ వేస్తుంది. ఆ తరువత జరిగే పరిణామాలు ఏమిటి ? సుందర్ రామస్వామి, ఓటు హక్కు పై ప్రజల్లో ఎలాంటి చైతన్యం తీసుకు వచ్చాడు ? ఈ క్రమంలో అవతల రాజకీయ పార్టీ లీడర్ కోమలవల్లి (వరలక్ష్మి శరత్ కుమార్) సుందర్ ను అడ్డుకోవడానికి ఏమి చేసింది ? ఎన్ని ఎత్తులు వేసింది ? వాటిని సుందర్ రామస్వామి ఎలా ఎదురుకున్నాడు ? చివరకు సుందర్ రామస్వామి అనుకున్నది సాధించాడా ? లేదా ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

బలాలు
+ కథాంశం
+ రాజకీయ నేపథ్యం
+ విజయ్‌
బలహీనతలు
– పాటలు
– లాజిక్‌ లేకపోవడం

రేటింగ్:  2.25 / 5

130 total views, 1 views today