మెగా హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్

మెగా హీరో సరసన చైతు హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కంచనున్న చిత్రం ద్వారా వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు.

గతంలో బుచ్చిబాబు సుకుమార్ దర్శకత్వశాఖలో పనిచేశారు. రంగస్థలం చిత్రానికి కూడా రైటర్‌గా పనిచేశారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు. అయితే ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన ‘సవ్యసాచి’లో అక్కినేని నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఎంపికైనట్టు తెలుస్తోంది.

44 total views, 1 views today