జబర్ధస్త్ నుంచి హైపర్ ఆది ఔట్?

‘జబర్దస్త్’ కామెడీ షోలో అతి తక్కువ కాలంలో బాగా పాపులరైన కమెడియన్ హైపర్ ఆది. అదిరే అభి టీమ్ ద్వారా జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తర్వాత తానే టీమ్ లీడర్ గా ఎదిగాడు. తన కామెడీ పంచులు, టైమింగ్ డైలాగులతో ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్ధస్త్ లో కేవలం ఆది కామెడీ, పంచ్ డైలాగ్స్ కోసమే చూసేవారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఈ మద్య జబర్ధస్త్ లో నటిస్తున్న కమెడియన్లు వెండితెరపై కూడా అలరిస్తున్నారు. ధన్ రాజ్, వేణు, చమ్మక్ చంద్ర, షకలక శంకర్ లాంటి వారు కమెడియన్లుగా ఎంట్రీ ఇవ్వగా షకలక శంకర్ ఈ మద్య హీరోగా రాణిస్తున్నాడు. అయితే హైపర్ ఆది కూడా ఈ మద్య సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు.

ఆది టీమ్ లీడర్ గా మారిన తర్వాత మిగతా టీమ్స్ రేటింగ్స్ పరంగా వెనకపబడిపోయారనే వాదన కూడా ఉంది. ఆయన స్కిట్స్ కి సంబంధించిన స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటాడు. ఆయన స్కిట్స్ లోని పంచ్ డైలాగ్స్ కి జనం పడిపడి నవ్వేవారు. అలాంటి హైపర్ ఆది ఈ షోలో రెండు వారాలుగా కనిపించడం లేదు. దాంతో ఆదీ విషయంపై రక రకాల చర్చలు మొదలయ్యాయి. ఈ షో ద్వారా వచ్చే సంపాదనతో అతడు సంతృప్తి పడటం లేదని, సినిమాల్లో ట్రై చేస్తున్నాడని ఇలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మరోవైపు మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ప్రాణమిచ్చే ఆది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అంటే వల్లమాలిన అభిమానం. ఆ మద్య పవన్ కళ్యాన్ విషయంపై సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాడు. ప్రస్తుతం ఏపిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పార్టీ ప్రచారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది సైతం పార్టీకి ప్రచారం చేయడానికి సమయం కేటాయించాడని, అందుకే ఈ షోకు దూరం అయ్యారనే మరో వానద కూడా ఉంది. కాకపోతే ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ హైపర్ ఆది వద్ద నుంచి రాలేదు. దాంతో యూట్యూబ్ లో రక రకాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

105 total views, 1 views today