యాదాద్రిలో లక్ష పుష్పార్చన

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో లక్షపుష్పార్చన పూజలు జరిగాయి. అనంతరం బాలాలయ కల్యాణమండపంలో సుదర్శన హోమం, నిత్యకల్యాణోత్సవ పర్వాలను ఆగమశాస్త్రరీతిలో చేపట్టారు. స్వామి వారికి 13,78,841 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

30 total views, 1 views today