హాకా ఆధ్వర్యంలో టపాకాయల విక్రయాలు

ప్రభుత్వ రంగ సంస్థ హాకా ఆధ్వర్యంలో దీపావళి పర్వదినం సందర్భంగా టపాకాయల విక్రయాలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ బిజినెస్‌ మేనేజర్‌ సీహెచ్‌ కృష్ణవేణి తెలిపారు. ఇందిరాపార్కు ఎదురుగా గల ఎన్టీఆర్‌ స్టేడియంలో టపాకాయలను విక్రయిస్తున్నామని చెప్పారు. శనివారం బషీర్‌బాగ్‌లోని హాకా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్టేడియంలో పది స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని, ఈ నెల 7 వరకు ఈ టపాకాయలను విక్రయిస్తామని ఆమె చెప్పారు. అతితక్కువ ధరకు నాణ్యమైన టపాకాయలను విక్రయిస్తున్నామని ఎలాంటి లాభాపేక్షలేకుండా గత 31 సంవత్సరాల మాదిరిగా టపాకాయలను విక్రయిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఈ స్టాల్స్‌ తెరిచి ఉంటాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణవేణి కోరారు.

60 total views, 1 views today