టెస్టులకి కోహ్లీ జీవం పోశాడు..!

క్రికెట్‌లో వన్డే, టీ20ల ప్రభావంతో ఆదరణ కోల్పోతున్న టెస్టులకి భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆటతో మళ్లీ జీవం పోశాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసించాడు. ఈ ఏడాది బ్యాట్‌తో అసాధారణరీతిలో చెలరేగిపోయిన విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో శతకం బాదిన కోహ్లి.. ఆ తర్వాత ఐదు వన్డేల సిరీస్‌లోనూ ఏకంగా మూడు సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో వేగంగా 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌‌మెన్‌గా నిలిచాడు.

‘క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు సూపర్‌స్టార్ల కొరత ఏర్పడింది. ఇంగ్లాండ్‌లో ఒకరిద్దరూ మాత్రమే ఆ స్థాయిలో ఆడుతున్నారు. ఇక భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి నిస్సందేహంగా సూపర్‌స్టారే. అతను టెస్టుల్లో ఆడటాన్ని అమితంగా ఇష్టపడుతున్నాడు. కోహ్లి జోరు ఇలానే కొనసాగితే ఐదు రోజుల ఫార్మాట్‌ మళ్లీ మునుపటి ఆదరణ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదరణ తగ్గిపోతున్న టెస్టులకి కోహ్లీ తన ఆటతో జీవంపోశాడు’ అని గ్రేమ్‌స్మిత్ వెల్లడించాడు.

40 total views, 1 views today