నోబాల్.. ఔట్.. తాహిర్‌కి చేదు అనుభవం

దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్‌కి ముందు జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్యాచ్ అందుకున్న ఇమ్రాన్ తాహిర్.. తన జెర్సీపై ఉన్న పేరుని ఆసీస్ అభిమానులకి చూపుతూ సంబరాలు చేసుకున్నాడు. కానీ.. ఆఖరికి అది నోబాల్‌గా తేలడంతో.. అవమానంగా ఫీలై కాసేపు అసహనానికి లోనయ్యాడు.

కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియా ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవన్ జట్టుతో దక్షిణాఫ్రికా జట్టు తాజాగా వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 42 ఓవర్లలో 173 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్యాన్ని పీఎమ్‌ ఎలెవన్ జట్టు కేవలం 36.3 ఓవర్లలోనే 174/6తో అలవోకగా ఛేదించేసింది.
మ్యాచ్ ఆరో ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా బౌలర్ రబాడ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ జోష్ ఫిలిప్పీ ఫుల్‌షాట్ ఆడాడు. దీంతో.. ఫైన్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేవగా.. అక్కడే బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇమ్రాన్ తాహిర్.. క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత ఆనందంలో.. తన వెనుక స్టాండ్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా అభిమానులని కవ్విస్తూ జెర్సీపై ఉన్న తన పేరుని చూపాడు. అయితే.. ఆ తర్వాత అంపైర్ నోబాల్ అని ప్రకటించడాన్ని చూసిన తాహిర్.. తీవ్ర అసహనంతో బంతిని బౌలర్‌కేసి విసిరాడు. కానీ.. అప్పటికే పీఎమ్ టీమ్ రెండో పరుగుని కూడా పూర్తి చేసేసింది.

37 total views, 1 views today