చ‌రిత్ర సృష్టించిన అమెరికా జిమ్నాస్ట్‌

అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ వ్యక్తిగత వాల్ట్‌ విభాగంలో స్వర్ణం నెగ్గిన బైల్స్‌.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 13 పసిడి పతకాలు నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. ఇదివరకు బెలారస్‌కు చెందిన పురుష జిమ్నాస్ట్‌ విటలీ చెర్బో (12) పేరు మీద ఉన్న ఆల్‌ టైమ్‌ రికార్డును ఆమె తిరగరాసింది. దోహాలో జరుగుతున్న ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమెకిది మూడో బంగారు పతకం. ఇంకో మూడు విభాగాల్లో పోటీపడనున్న ఆమె వాటిల్లో కూడా స్వర్ణ పతకాలు గెలవాలనే పట్టుదలతో ఉంది.

39 total views, 1 views today