సవ్యసాచి మూవీ రివ్యూ

చిత్రం : సవ్యసాచి
నటీనటులు : నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నల కిషోర్
దర్శకత్వం : చందు మొండేటి
సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాతలు : నవీన్ వై.సి వి మోహన్, వై రవి శంకర్

అక్కినేని నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో ‘సవ్యసాచి’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కీలకపాత్రల్లో నటించారు. మరీ ప్రేక్షకుల అంచనాలను ఎంత మేరకు అందుకుందో చూద్దాం.

కథ : వాణిజ్య ప్రకటనలు తీసే దర్శకుడు విక్రమ్ ఆదిత్య (నాగచైతన్య). వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో పుట్టిన వ్యక్తి. విక్రమ్ ఆదిత్యకు తన అక్క భూమిక కూతురు మహా లక్ష్మి అంటే ప్రాణం. ఆ పాపలో చనిపోయిన తన తల్లిని చూసుకుంటుంటాడు. ఆరేళ్ల కిందట కాలేజీలో చిత్ర (నిధి అగర్వాల్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఒకరికొకరు దగ్గరయ్యే క్రమంలోనే దూరమవుతారు. ఆరేళ్ల తర్వాత అనుకోకుండా మళ్లీ కలుసుకుంటారు. విక్రమ్ మేనకోడలు (భూమిక కూతురు) కిడ్నాప్ కి గురవుతుంది. ఆ కిడ్నాప్ చేసింది ఎవరు ? అరుణ్ (మాధవన్ )కి ఆ కిడ్నాప్ కి సంబంధం ఏమిటి ? ఒకవేళ అరుణ్ కిడ్నాప్ చేసి ఉంటే ఎందుకు చేసి ఉంటాడు ? ఇంతకీ అరుణ్ కి విక్రమ్ ఆదిత్య కు మధ్య వైరం ఏమిటి ? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
నాగ చైతన్య ఒకరిలో ఇద్దరిలా చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కథానాయికగా నటించిన నిధి అగర్వాల్ తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ తో పాటుగా నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కాలేజీ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. తెలుగు ప్రేక్షకులకు లవర్ బాయ్ గా పరిచయం ఉన్న మాధవన్.. పవర్ ఫుల్ విలన్ పాత్రలో తన గాంభీరమైన నటనతో మెప్పించారు. మరో కీలక పాత్రలో నటించిన భూమిక కూడా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:
దర్శకుడు చందు మొండేటి వానిషింగ్ ట్విన్ సిండ్రోమ సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు. కానీ ఆకట్టుకునే సన్నివేశాలను రాసుకోలేకపోయారు. సినిమాలో అనవసరంగా కామెడీని జొప్పించే ప్రయత్నం చేశారు. ఆ కామెడీ కూడా సరిగ్గా పండలేదు. ముఖ్యంగా సుభద్ర పరిణయం నాటకం లాంటి కామెడీ సీక్వెన్స్ పెట్టకుండా ఉండి ఉంటే బాగుండేది. కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, కథనం స్లోగా సాగడం, లవ్ స్టోరీ పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం, మాధవన్ అంత క్రూరమైన విలన్ గా మారడానికి బలమైన కారణాలను చూపించపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

సాంకేతిక విభాగం :
జే యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి అందించిన పాటలు ఆయన స్థాయికి తగ్గట్టు లేకపోయిన పర్వాలేదనిపస్తాయి. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5

144 total views, 1 views today