సంబ‌రాల్లో టీమిండియా… వీడియో

తిరువనంతపురం: వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో 9 వికెట్లతో సునాయాస విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను 3-1తో ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత టీమ్ బస చేసే హోటల్లో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ప్లేయర్స్ బాగా ఎంజాయ్ చేశారు. కేక్‌ను రోహిత్‌శర్మ కట్ చేయగా.. అతని వెంటే ఉన్న ధోనీ, జడేజా ఓ బెలూన్‌ను పగులగొట్టి అతన్ని భయపెట్టారు. టీమ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. చివరి వన్డేలో విండీస్‌ను కేవలం 104 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. తర్వాత టార్గెట్‌ను కేవలం 14.5 ఓవర్లలోనే చేజ్ చేసిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లి.. రికార్డు స్థాయిలో ఏడోసారి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఇండియా, వెస్టిండీస్ ఇక ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే మూడు టీ20ల సిరీస్‌లో తలపడనున్నాయి.

61 total views, 1 views today