శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 2019 ఫిబ్రవరి నెలకు సంబంధించి 67,146 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. 9,796 సేవా టికెట్లు. సుప్రభాతం 7,096, తోమాల 110, అర్చన 110 టికెట్లు. అష్టాదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300, కరెంటు బుకింగ్ కింద 57,350 ఆర్జిత సేవా టికెట్లు విడుదల. విశేషపూజ 2,000, కల్యాణోత్సవం 12,825 సేవా టికెట్లు. ఊంజల్‌సేవ 4,050, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425 టికెట్లు. వసంతోత్వవం 14,850, సహస్రదీపాలంకరణ 16,200 టికెట్లను టీటీడీ విడుదల చేసింది.

58 total views, 1 views today