బాక్సింగ్‌ ఛాంపియన్‌తో తలపడిన కేంద్రమంత్రి… వీడియో వైర‌ల్‌

ఒకరు ఒలింపిక్స్ షూటింగ్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన వ్యక్తి.. మరొకరు బాక్సింగ్‌లో ఒలింపిక్ మెడల్ గెలిచిన తొలి భారతీయురాలు.. వీళ్లిద్దరూ ఇప్పుడు దేశ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లలో రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రిగా ఉండగా.. బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈ ఇద్దరూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఫ్రెండ్లీగా బాక్సింగ్ చేశారు. చాంపియన్ అయిన మేరీ కోమ్‌ను డామినేట్ చేయడానికి రాథోడ్ ప్రయత్నించినా.. ఆమె మాత్రం టైమ్‌లీ పంచ్‌లతో రాథోడ్‌ను కంగుతినిపించింది. ఈ ఇద్దరి సరదా బాక్సింగ్ అక్కడున్న వాళ్లందరినీ ఆకట్టుకుంది.

65 total views, 1 views today