98 మార్కుల బామ్మకు సీఎం సత్కారం

తిరువనంతపురం : అలప్పుజ జిల్లాకు చెందిన కార్తియాని అమ్మ(96) కేరళ ప్రభుత్వం నిర్వహించిన సాక్షరత కార్యక్రమం పరీక్షలో నూటికి 98 మార్కులు సాధించిన సంగతి తెలిసిందే. 98 మార్కులు సాధించిన కార్తియాని అమ్మను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ సత్కరించారు. అనంతరం సాక్షరత కార్యక్రమం సర్టిఫికెట్‌ను బామ్మకు ప్రదానం చేశారు.

నేను కాపీ కొట్టలేదు : కార్తియాని అమ్మ
నూటికి 98 మార్కులు ఎలా సాధించారని బామ్మను మీడియా ప్రశ్నించగా.. తాను కాపీ కొట్టలేదని ఆమె స్పష్టం చేశారు. తన పేపర్‌ను చూసి అందరూ కాపీ కొట్టారని చెప్పారు. తాను ఏం రాశానో వారికి చెప్పానని కార్తియాని అమ్మ తెలిపారు.

59 total views, 1 views today