‘అఅఅ’లో ఇలియానా లుక్ విడుద‌ల‌

చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో క‌ట్టిప‌డేసిన గోవా బ్యూటీ ఇలియానా. పోకిరీ చిత్రంలో ఇలియానా న‌ట‌న‌తో పాటు ఆమె లుక్స్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. ఆరేళ్ళ క్రితం తెలుగు ఇండ‌స్ట్రీకి బై చెప్పిన నాజుకు భామ త‌న బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి ఫోటో షూట్స్ చేస్తూ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌చ్చింది. ర‌వితేజ తాజా చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని(అఅఅ) తో ఆరేళ్ళ త‌ర్వాత‌ తెలుగు తెర‌కి రీ ఎంట్రీ ఇచ్చింది . శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రం తెర‌కెక్క‌గా ఈ సినిమా కోసం ఇలియానా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్టు తెలుస్తుంది. నవంబ‌ర్ 16న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ఇలియానా లుక్‌కి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో ఇలియానా లుక్ స‌రికొత్త‌గా ఉంది. ఆమె అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ర‌వితేజ‌, ఇలియానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రానికి శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అతి త్వ‌ర‌లోనే చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాతో ఇలియానా తెలుగులో మ‌రిన్ని ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటుందా లేదా అనేది చూడాలి.

54 total views, 1 views today