రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న ఇద్ద‌రు కాదు ముగ్గురు భామ‌లు

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ డా.రాజ‌శేఖ‌ర్ గ‌త ఏడాది గ‌రుడ వేగ చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం సాధించాడు. ఇదే ఉత్సాహంతో అ! వంటి విల‌క్షణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో క‌ల్కి చిత్రం చేస్తున్నాడు. ఇది 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో సినిమా తెర‌కెక్కనుంది. ఈ చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి క‌ల్కి అనే టైటిల్ ప‌రిశీలిస్తుండ‌గా ఇందులో రాజశేఖ‌ర్ స‌ర‌స‌న ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌ను ఓకే చేశారు.

అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ ఫేం నందిత శ్వేత‌. ఈ ముగ్గురు భామ‌లు రాజశేఖ‌ర్ తో చేయ‌బోవు సంద‌డి ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నుందట‌. ఆ మ‌ధ్య చిత్ర ప్రీలుక్ విడుద‌ల కాగా ఇందులో 1983లో క‌పిల్ దేవ్ వ‌ర‌ల్డ్ అందుకున్న ఫోటోతో పాటు అదే సంవ‌త్స‌రంలో విడుద‌లైన ఖైదీ మూవీ పోస్ట‌ర్ క‌నిపించింది. అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హైద‌రాబాద్ అవుట్ స్కర్ట్స్‌లో రెండు కోట్ల రూపాయ‌ల‌తో వేసిన భారీ సెట్‌లో ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.

58 total views, 1 views today