విమానం కొనాల‌న్న‌ది క‌ల‌… ఆ క‌ల‌ను ఇలా నెర‌వేర్చుకున్నాడు

చిన్నప్పుడు కలలు కనడం సహజమే.. ఆ కలలను సాధించాలనే తపన అందరికీ ఉంటుంది.. కానీ కొందరు సాధిస్తారు.. ఇంకొందరు సాధించలేకపోతుంటారు. చైనాకు చెందిన ఓ రైతు కూడా తన చిన్నతనంలో ఓ కల కన్నాడు. అదేమిటంటే.. జీవితంలో తాను ఒక విమానం కొనాలని. కానీ అది రైతుకు సాధ్యమయ్యే పనేనా! కాదు. మరి ఎలా? మొత్తానికి తాను చిన్నప్పుడు కన్న కలను నిజం చేసుకోలేకపోయినప్పటికీ.. తన ఫామ్‌హౌస్ వ‌ద్ద విమాన ప్రతిరూపాన్ని నిర్మించి.. తన కలను సాకారం చేసుకుంటున్నాడు ఆ రైతు.

రైతు జుయూ వెల్లుల్లి వ్యాపారి. తన పంట చేనులో కొంత స్థలంలో విమానం నిర్మించేందుకు పూనుకున్నాడు. ఎయిర్‌బస్ ఏ320ని పోలిన విమాన ప్రతిరూపాన్ని రైతు నిర్మిస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన పనులు.. త్వరలోనే పూర్తి కానున్నాయి. 124 అడుగుల పొడవు, 118 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు దీని నిర్మాణానికి రూ. 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. విమానం ప్రతిరూపం పూర్తయిన తర్వాత దీన్ని రెస్టారెంట్‌గా మార్చనున్నట్లు రైతు తెలిపాడు. అయితే విమానం లోపల ఎలా ఉంటుందో అలాగే నిర్మిస్తున్నారు.

81 total views, 1 views today