ప్రపంచంలోనే ఎతైన విగ్రహాలు…విశేషాలు

పటేల్ స్టాట్యూ అఫ్ యూనిటీ ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం.ఈ విగ్రహాన్ని 597 అడుగుల ఎత్తుతో నిర్మించారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 143వ జయంతిని పురస్కరించుకుని 31 అక్టోబర్ న విగ్రహావిష్కరణ ముహుర్తం కుదిర్చారు.3000 కోట్ల వ్యయంతో దాదాపు 4 సం.సమయం తీస్కొని నిర్మితమైన ఈ విగ్రహం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది .మరి ఇంతకముందు ఉన్న అతి పెద్ద విగ్రహం ఏది…?ఎక్కడుండేది…?అసలు ప్రపంచం లో ఎతైన విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం …..

*చైనా -గునియన్ అఫ్ ది సౌత్ సీ అఫ్ సానియా
ఈ విగ్రహం చైనా లోని నంశన్ టెంపుల్ దెగ్గర ఉంది.ఈ విగ్రహం ఎత్తు 354 అడుగులు.ఈ విగ్రహాన్ని ప్రొటెక్షన్ అఫ్ ది కంట్రీ స్టాట్యూ అని కూడా అంటారు.2005 లో దీని ఆవిష్కరణ 108 మంది బౌద్దుల చేత జరిగింది.

*జపాన్ -ఉషికు దైబూట్సు (బుద్ద విగ్రహం )
ఈ విగ్రహం జపాన్ లోని ఉషుకిలో ఉంది,దీని ఎత్తు 394 అడుగులు.4000 టన్నులు ఉన్న ఈ విగ్రహం 1993 లో ఆవిష్కరించబడింది.ఇందులో ౩౦ అడుగులు బేస్ మరో ౩౦ అడుగులు లోటస్ ఆకారం ఉంటుంది .సందర్శకులు 250 అడుగుల ఎత్తు వరకు వెళ్ళవచ్చు.

 

 

*మయన్మార్- బుద్ధ విగ్రహం
మయన్మార్ లో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద విగ్రహం ఉంది.ఈ విగ్రహ కూడా బుద్ధుడిదే.లేక్యూన్ షెట్కయర్ పేరుతో ఉన్న దీని ఎత్తు 427 అడుగులు.మయన్మార్ బుద్ధ కళలు కూడా ప్రసిద్ధం.

*చైనా -స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ
స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం చైనా లో హెసెన్ ప్రావిన్స్ లో ఉంది ,దీని ఎత్తు 502 అడుగులు.ఈ విగ్రహం ప్రపంచంలో ఎతైన విగ్రహంగా పేరు పొందింది.ఈ విగ్రహాన్ని సందర్శించడానికి ఏటా సుమారు 10 లక్షలమంది ఉంటారు.భారత్ లో నిర్మించిన పటేల్ విగ్రహం వల్ల ఈ విగ్రహం రెండో అతి పెద్ద విగ్రహంగా మారింది.

*భారత్-సర్దార్ పటేల్ స్టాట్యూ అఫ్ యూనిటీ
భారత ప్రభుత్వం పటేల్ విగ్రహాన్ని 597 అడుగుల ఎత్తుతో నిర్మించింది.ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎతైన విగ్రహాల్లో ప్రధమ స్థానం పొందింది.ఈ విగ్రహం ‘స్టాట్యూ అఫ్ లిబర్టీ అమెరికా’ కంటే రెట్టింపు ఎత్తులో ఉంటుంది.రోజుకు 15000 మంది సందర్శించే ఏర్పాట్లు చేసారు.

73 total views, 1 views today