ట్రంప్‌కు గొడుగు మూసే స‌మ‌యం కూడా లేదా… నెటిజ‌న్ల కామెంట్లు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మ‌రోసారి నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపించారు. ఇందుకు కార‌ణం ఏంటంటే… జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి ఇలినాయిస్ వెళ్లేందుకు ట్రంప్ విమానం ఎక్కే స‌మ‌యంలో జోరున వ‌ర్షం ప‌డింది. దీంతో ఆయ‌న విమానం ఎక్కే స‌మ‌యంలో గొడుగు ఉప‌యోగించారు. అయితే విమానం లోప‌లికి అడుగుపెట్టే స‌మ‌యంలో ట్రంప్ గొడుగును మ‌డ‌త‌పెట్టి లోనికి తీసుకువెళ్ల‌కుండా బ‌య‌ట అలాగే వ‌దిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజ‌న్లు వూరికే ఉంటారా. వెట‌కారంగా కామెంట్ల వ‌ర్షం కురిపించారు. ట్రంప్‌కు గొడుగు మూసే స‌మ‌యం కూడా లేదు, ట్రంప్‌కు గొడుగు మూయ‌డం కూడా చేత‌కాదు అంటూ కామెంట్స్ చేస్తూ వీడియోను ఇత‌రుల‌తో పంచుకుంటున్నారు.
ఈ మధ్యే ఇదే ఎయిర్‌ఫోర్స్ వన్‌ను ట్రంప్ ఎక్కుతున్న సమయంలో ఆయన కాలికి ఓ టాయిలెట్ పేపర్ అతుక్కుంది. అది చూసుకోకుండా ఆయన అలాగే ఎక్కడం, ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో అప్పుడూ నెటిజన్లు ఇలాగే ట్రంప్‌పై కామెంట్లు విసిరారు.

31 total views, 1 views today