‘మ‌జిలి’ వీడియో లీక్.. షాకైన సామ్

ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి మ‌జిలి అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తుండ‌గా, ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా చిత్రానికి సంబంధించి ఓ వీడియో లీక్ కాగా, ఆ వీడియోని నెటిజ‌న్ స‌మంత‌కి షేర్ చేస్తూ.. ఈ వీడియో చూశాక గొప్ప అనుభూతి క‌లుగుతుంది. చైతో మీరు ఏదైన సీక్రెట్ మాట్లాడుతున్నారా.. మ‌జిలి సినిమా విశేషాల కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నాం అని కామెంట్ పెట్టాడు. అయితే వీడియోని చూసిన స‌మంత షాక్ అయింది. చిత్రీక‌ర‌ణ‌కి సంబంధించిన మేకింగ్ వీడియో ఎలా రిలీజ్ అయిందంటూ ఆశ్చ‌ర్యాన్ని ఎమ్మోజీల‌ని ద్వారా తెలిపింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

39 total views, 2 views today