నాలుగు భాష‌ల‌లో వ‌ర్మ ‘భైర‌వ‌గీత’ విడుద‌ల‌

కాంట్ర‌వ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఒక‌వైపు ద‌ర్శ‌కుడిగా వ‌రుస సినిమాలు చేస్తూనే మ‌రో వైపు నిర్మాత‌గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్న వ‌ర్మ ఇటీవ‌ల భైర‌వ‌గీత అనే చిత్రాన్ని నిర్మించాడు. తగరు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సిద్దార్థ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇర్రా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ న‌వంబ‌ర్ 22న నాలుగు భాష‌ల‌లో విడుద‌ల కానుంది. ఏకకాలంలో కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన‌ భైరవ గీతను తమిళం, హిందీలో డ‌బ్ చేసి విడుదల చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఆ మ‌ధ్య విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే వ‌ర్మ మార్క్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది.

79 total views, 1 views today