నా పెళ్లి.. ఎవరికీ చెప్పకండి ప్లీజ్..

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలలో విజయ్ దేవరకొండకి స్నేహితుడిగా నటించిన రాహుల్ రామకృష్ణ ఓ ఇంటివాడవుతున్నాడు. ఈ విషయాన్ని తనే ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అందరికంటే కాస్త భిన్నంగా సర్‌ప్రైజ్ చేశాడు. పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి అంటూ.. జనవరి 15న పెళ్లి అని తన కాబోయే భార్యతో బీచ్‌లో దిగిన ఫోటోని షేర్ చేశాడు. రామక‌ృష్ణ పెళ్లి విషయం తెలియడంతో తోటి నటులు నిఖిల్ సిద్దార్థ్, సుశాంత్, కమెడియన్ వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ రామన్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఓ తమిళ్ చిత్రంతో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు.

రచయితగా రాణిస్తూ సైన్మా అనే లఘు చిత్రంలో నటించి మెప్పించాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. పెళ్లి చూపులు చిత్రంలో రెండు పాటలు కూడా రాశాడు. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ ఓ డిఫరెంట్ యాక్టర్‌గా ముద్ర వేసుకున్నాడు రామకృష్ణ.

103 total views, 1 views today