బైక్‌ను ఢీకొట్టిన నిర్మాత సురేష్‌బాబు కారు

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు కారు కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో బీభత్సం సృష్టించింది. సురేష్ బాబు ప్ర‌యాణిస్తున్న‌ కారు ఇంపీరియల్ గార్డెన్ వద్ద రాంగ్ రూట్లో వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు సతీశ్ చంద్ర(35), దుర్గా(30) సహా మూడేళ్ల చిన్నారి సిద్దేశ్ చంద్రకు తీవ్రగాయాలయ్యాయి. కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేశారు. సురేష్‌బాబుకు సెక్ష‌న్ 41ఏ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్ష‌త‌గాత్రులు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వెళ్లే క్రమంలో సురేష్ బాబు కారు బైక్‌ను ఢీకొట్టింది.

75 total views, 1 views today