అరవిందసమేత సక్సెస్ మీట్.. చీఫ్‌ గెస్ట్‌ బాలకృష్ణ

ఈ దసరా సీజన్లో అరవింద సమేత బాక్సాఫీస్ కలెక్షన్లను ఓ రేంజ్ లో కొల్లగొట్టింది. మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా, 8 రోజుల్లోనే 130 కోట్లకు పైగా గ్రాస్ ని, వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసి 150 కోట్ల మార్క్ వైప్ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా అరవిందసమేత టీమ్ గ్రాండ్ గా ఇవాళ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

Vvఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, జగపతి బాబు నటన, తమన్ మ్యూజిక్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి ఈ చిత్రంలో. హారికా అండ్ హాసినీ బ్యానర్లో కమర్షియల్ గా ఈ సినిమానే బిగ్గెస్ట్ హిట్. సినిమా సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ సక్సెస్ ని అభిమానులతో షేర్ చేసుకోడానికి ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోనే శిల్పకళావేదికలో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా నటసింహా బాలకృష్ణ వస్తుండటం హైలైట్.

96 total views, 1 views today