మా అమ్మకి ఇస్తాను

ప్రముఖ యాంకర్‌, క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ గాయత్రి భార్గవి..ఎన్టీఆర్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. తారక్‌ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తారక్‌ను గాయత్రి భార్గవి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా తన తాతగారు శంకర్‌ నారాయణ కొంతకాలం క్రితం గీసిన హరికృష్ణ చిత్రపటాన్ని తారక్‌కు కానుకగా ఇచ్చారట.ఈ కానుక చూడగానే తారక్‌ కళ్లల్లో ఎంతో ఆనందాన్ని చూశానని తెలిపారు. ఈ విషయాన్ని గాయత్రి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘మా తాతగారు శంకర్‌ నారాయణ గీసిన చిత్రపటం తారక్‌కు అందింది. ఆ కానుకను చూసినప్పుడు తారక్‌ కళ్లల్లో నేను చూసిన ఆనందం వర్ణనాతీతం. ఈ కానుక తీసుకుంటూ..‘అమ్మకు ఇస్తానండీ’ అన్నారు.’ అని వెల్లడిస్తూ ఫొటోను పంచుకున్నారు. ‘అరవింద సమేత..’ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే తారక్‌ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దాంతో చాలా రోజుల పాటు తారక్‌ ఎంతో కుమిలిపోయారు. వర్కే తనను మామూలు మనిషిని చేసిందని ఒకానొక సందర్భంలో వెల్లడించారు తారక్‌.

109 total views, 1 views today