పెళ్లి తర్వాత ఇంకా బలం పెరిగింది-సమంత

అక్కినేని నాగచైతన్య, సమంతల ప్రేమ.. వైవాహిక బంధంగా మారి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సామ్‌ తన ప్రియమైన భర్తకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘నా జీవితంలో అత్యంత గొప్ప విషయం ఏంటంటే.. ప్రతి రోజూ నీ కోసం తిరిగి ఇంటికి రావడమే. నాలోని సగ భాగానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. సతీమణిగా నాగచైతన్య పట్ల చాలా గర్వంగా ఉన్నాను. శుభాకాంక్షలు చెబుతూ మీరు పంపిన సందేశాలకు ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు పొందిన ప్రతిసారి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది’ అని సామ్‌ పేర్కొన్నారు. దీంతోపాటు ఐబిజాలో చైతన్యతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

పెళ్లి తర్వాత తన జీవితంలో ఎటువంటి మార్పు రాలేదని సామ్‌ ఓ సందర్భంలో చెప్పారు. అప్పటితో పోల్చితే తన బలం ఇంకా పెరిగిందని తెలిపారు. సామ్‌ తన కుటుంబంతో బాగా కలిసిపోయిందని చైతూ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. నటన పరంగా చైతన్య కంటే సామ్‌కే ఎక్కువ మార్కులు వేస్తానని నాగ్‌ తన కోడల్ని పలుమార్లు ప్రశంసించారు.

ఇటీవల అక్కినేని కుటుంబం యూరప్‌కు విహారయాత్ర నిమిత్తం వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని రోజులు సరదాగా గడిపి రెండు రోజుల క్రితం తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. ఈ ట్రిప్‌లో దిగిన ఫ్యామిలీ ఫొటోలను నాగ్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సామ్‌, చైతన్య జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రంతో బిజీగా ఉన్నారు. నాగ్.. ధనుష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

66 total views, 1 views today