కుటుంబం తో ఇంకా సరదాగా ఉంటుంది

కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళితే చాలా సరదాగా ఉంటుందని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున అన్నారు. అక్కినేని కుటుంబం ప్రస్తుతం ఐబిజాలో ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. నాగ్‌తోపాటు అమల, నాగచైతన్య, సమంత, అఖిల్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇప్పటికే సమంత అక్కడ దిగిన పలు ఫొటోలను షేర్‌ చేశారు. ‘దేవదాస్‌’ విడుదలకు ముందు రోజు నాగ్‌ ఈ ట్రిప్‌లో జాయిన్‌ అయ్యారు.

తాజాగా నాగార్జున ఐబిజాలో దిగిన గ్రూప్‌ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘కుటుంబ సభ్యులు, స్నేహితులు, ‘దేవదాస్‌’ విజయం అందుకున్న సంతోషంతో.. విహారయాత్ర ఇంకా సరదాగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు.

197 total views, 1 views today