దేవదాస్ ప్రీమియర్ షో టాక్..

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ట్రైలర్ , టీజర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై అందరిలో భారీ అంచనాలే పెరిగాయి.. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను భారీ స్థాయి లో ఈరోజు థియేటర్స్ లలో విడుదల చేసారు. మనదగ్గర మరికొద్ది నిమిషాల్లో చిత్ర షోలు ప్రారంభం కానుండగా , అమెరికా లో అర్ధరాత్రి నుండే ప్రీమియర్స్ షోస్ మొదలు అయ్యాయి.

సినిమా ఫై అందరిలో ఆసక్తి పెరగడం తో అక్కడి డిస్ట్రబ్యూటర్స్ సైతం దాదాపు 180 లొకేషన్లలో చిత్ర ప్రీమియర్స్ షోస్ వేయడం జరిగింది. ఇక సినిమా చూసిన అభిమానులు , సినీ ప్రేమికులు సినిమా ఫై పాజిటివ్ టాక్ చెపుతున్నారు. తమ తమ సోషల్ మీడియా ద్వారా సినిమా చాల బాగుందని , ఫుల్ ఎంటర్టైనర్ మూవీ అని చెపుతున్నారు. సెకండ్ హాఫ్ నాని కామెడీ తో రచ్చ రచ్చ చేసాడని , రష్మిక , నాని ల మధ్య వచ్చే సీన్లు చాల ఆకట్టుకున్నాయని, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ సైతం ఆకట్టుకునేలా ఉందని చెపుతున్నారు. శ్రీరామ్ ఖాతాలో మరో హిట్ చేరినట్లే అని , వైజయంతి మూవీస్ వారి నిర్మాణ విలువులు సైతం ఆకట్టుకున్నాయని చెపుతున్నారు.

ఇక కథ విషయానికి వస్తే..దేవ ఇంటర్నేషనల్ మాఫియా డాన్. దాస్ ఒక డాక్టర్. అసలు వీళ్లిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఒక డాన్‌కు, డాక్టర్‌కు స్నేహం ఎలా కుదిరింది? ఆ డాక్టర్‌ను డాన్ ఎలా వాడుకున్నాడు? అనేది చాల ఇంట్రస్టింగ్ గా ఉందని చెపుతున్నారు. ఓవరాల్ గా దేవదాస్ కు పాజిటివ్ టాక్ వైరల్ అవుతుంది.

నాగార్జున, నాని లాంటి స్టార్ హీరోలు కలిసి మొదటిసారి వెండితెరను పంచుకోవడంతో సినిమాపై అంచనాలు పెంచుకున్నామని , అంచనాలకు తగ్గట్లే నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా సూపర్బ్ గా నటించారని , . వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ అదిరింది చెపుతున్నారు. ఇక హీరోయిన్లు రష్మిక , ఆకాంక్ష ఇద్దరు సైతం తమ గ్లామర్ తోనే కాకుండా నటన తోను బాగా ఆకట్టుకున్నారు.

237 total views, 1 views today