బ్రేక్ తీసుకోకుండా పనిచేస్తే ఆరోగ్యానికీ ప్రమాదకరం

ఒళ్లు అలిసేలా పనిచేస్తే ప్రమోషన్ల సంగతి దేవుడెరుగు.. భవిష్యత్ కు, ఆరోగ్యానికీ అది ప్రమాదకరమని తాజా అథ్యయనం వెల్లడించింది. ఉద్యోగ బాధ్యతల్లో అదనపు శ్రమతో పనిచేసేవారు అనారోగ్యాలకు గురికావడంతో పాటు ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రమోషన్లు దక్కలేదనే అసంతృప్తిలో కూరుకుపోతున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, ఈఎస్‌సీపీ యూరప్‌ బిజినెస్‌ స్కూల్‌ చేపట్టిన అథ్యయనం పేర్కొంది. యాజమాన్యాలు ఉద్యోగులను ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తూ వారికి అనువైన సమయాల్లో పనిచేసే వెసులుబాటు కల్పిస్తే మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగుల నుంచి కంపెనీ పట్ల ఆదరణ పెరుగుతాయని చెప్పింది.

174 total views, 1 views today