రాత్రి పూట త్వరగా తినేస్తే క్యాన్సర్ ముప్పు తక్కువ

రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే డిన్నర్‌ను రాత్రి 9 గంటలలోపు ముగించాలని పరిశోధకులు చెపుతున్నారు. రాత్రి బాగా ఆలస్యంగా ఆహారం తీసుకుంటే శరీరంలో చక్కెర నిల్వలు పెరిగి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని బార్సిలోనా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ పరిశోధకులు వెల్లడించారు. పొద్దుపోయేవరకూ పనిచేయడం, ఆలస్యంగా తినడం ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటున్నారు. రాత్రి 9 గంటలలోపు డిన్నర్‌ తీసుకుంటే మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌, పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు 20 శాతం వరకూ తగ్గుతుందని తెలిపారు.

186 total views, 1 views today