శృంగారాన్ని నిరాక‌రించే హ‌క్కు దంప‌తులిద్ద‌రికీ ఉంటుంది

భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. శారీరక సంబంధాన్ని నిరాకరించే హక్కు భార్యాభర్తలిద్దరికీ ఉంటుందని స్పష్టం చేసింది. జీవిత భాగస్వామిపై అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లంటే భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు భార్య ఎల్లవేళలా సంసిద్ధంగా, సమ్మతంతో ఉండటం కాదు. ఆమె అంగీకారంతో ఉన్నట్లు భర్త నిర్ధారించుకోవాలి’ అని ధర్మాసనం తెలిపింది.

187 total views, 1 views today